‘అఖండ 2’.. మరోసారి డివైన్ ఎలిమెంట్ తో మ్యాజిక్ చేయబోతున్న కాంబో..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను. వీరి కలయికలో వచ్చిన ‘సింహా, లెజెండ్, అఖండ’ చిత్రాలు ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా అద్భుతమైన విజయాలు సాధించాయి. వీరి కలయికలో ఈ సారి డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ కొత్త సినిమా రూపొందనుందనే ప్రచారం కొన్నాళ్లుగా జోరందుకుంది.

‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ గా బాలకృష్ణతో ‘అఖండ 2’ తెరకెక్కించబోతున్నానని గతంలోనే ప్రకటించాడు బోయపాటి. లేటెస్ట్ గా మరోసారి ‘అఖండ 2’పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫస్ట్ పార్ట్ తరహాలోనే డివైన్ ఎలిమెంట్ తో ‘అఖండ 2’ రూపొందుతుందని క్లారిటీ ఇచ్చాడు బోయపాటి. ప్రస్తుతం బాలకృష్ణతో చేయబోయే ‘అఖండ 2’కి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్ లో బోయపాటి ఒక సినిమా చేయబోతున్నాడు. మరి.. గీతా ఆర్ట్స్ లో చేయబోయే సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే దానిపైనా ఇంకా క్లారిటీ రాలేదు.

ఇక.. నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ నుంచి ఆమధ్య రిలీజైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుండడంతో ఈ మూవీ షూట్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడట బాలయ్య. మళ్లీ జూన్ నుంచి బాబీ సినిమా తిరిగి పట్టాలెక్కనుందట.

Related Posts