అన్ని భాషల్లోనూ అదరగొడుతోన్న త్రిష

చెన్నై సోయగం త్రిష ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. అయినా.. ఇప్పటికీ అదే స్పీడుతో కథానాయికగా దూసుకుపోతుంది. ముఖ్యంగా.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ అగ్ర కథానాయకులకు మొదటి ఆప్షన్ గా మారుతోంది. తమిళంలో సీనియర్ హీరోలు కమల్ హాసన్, అజిత్ లకు జోడీగా నటిస్తుంది త్రిష. కమల్-మణిరత్నం ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్‘లో త్రిష హీరోయిన్. అజిత్ ‘విదా ముయార్చి‘లోనూ కథానాయికగా నటిస్తుంది.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘లో చాలామంది కథానాయికలు ఉంటారనే ప్రచారం జరిగింది. ముల్లోకాలకు సంబంధించిన సోషియో ఫాంటసీ స్టోరీ కావడంతో ఈ సినిమాలో ఎక్కువమంది నాయికలకు స్కోప్ ఉందట. అయితే.. వీరిలో మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిష అని తెలుస్తోంది. లేటెస్ట్ గా ‘విశ్వంభర‘ సెట్స్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ‘స్టాలిన్‘ తర్వాత చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ఇది.

తెలుగు, తమిళంలోనే కాదు మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ‘రామ్‘ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మోహన్ లాల్-జీతూ జోసెఫ్ కాంబోలో ‘దృశ్యం‘ సిరీస్, ‘నెరు‘ వంటి సినిమాలొచ్చాయి. అలాంటి క్రేజీ కాంబోలో వస్తోన్న ‘రామ్‘ పైనా భారీ అంచనాలున్నాయి. ఇక.. బాలీవుడ్ లోనూ సల్మాన్ కి జోడీగా నటించబోతుందట త్రిష. ‘పంజా‘ ఫేమ్ విష్ణు వర్థన్ దర్శకత్వంలో సల్మాన్ నటించే ‘ది బుల్‘లో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారట.

Related Posts