‘ఆపరేషన్ వాలెంటైన్‘ నుంచి రొమాంటిక్ సాంగ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్‘. ఆద్యంతం ఏరియల్ యాక్షన్ తో రూపొందిన ఈ మూవీ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే టీజర్, ‘వందేమాతరం‘ పాటతో సందడి చేస్తోన్న ‘ఆపరేషన్ వాలెంటైన్‘ నుంచి లేటెస్ట్ గా మరో సాంగ్ రిలీజయ్యింది. ‘గగనాల తేలాను.. నీ ప్రేమలోనా.. ‘ అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్ ఆలపించాడు. హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ మధ్య రొమాంటిక్ గా చిత్రీకరించిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Related Posts