టాలీవుడ్ లో ట్రైయాంగిల్ ఫైట్ ..

టాలీవుడ్లో పోటీ లేకుండా సినిమాలను విడుదల చేయడం చాలా కష్టం. పైగా కరోనా కారణంగా రిలీజ్ కానీ సినిమాల వల్ల ఇప్పుడు మరింతగా పోటీ పెరుగుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఎఫ్3ని ఈ మధ్యే ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాతి రోజు చిరంజీవి ఆచార్య విడుదలవుతోంది. ఇప్పుడు ఎఫ్3 ఆచార్యతో పోటీ పడకుండా మే 27ని రిలీజ్ డేట్ గా లాక్ చేసుకుంది. అయితే అదే డేట్ కి ఆల్ రెడీ మరో రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. అందులో ఒక పాన్ ఇండియా మూవీ కూడా ఉంది.
కోరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయిన పెద్ద సినిమాలన్నీ ఈ సమ్మర్లో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. అందులో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట వంటి సినిమాలు పోటీ లేకుండానే వస్తున్నాయి. కానీ ఆచార్య, ఎఫ్3 చిత్రాలు మాత్రం ఒక రోజు గ్యాప్ తో ఏప్రిల్ 28, 29న రిలీజ్ కి రెడీ అని ప్రకటించాయి. ఎఫ్3 వల్ల ఆచార్యకి ఓపెనింగ్స్ తగ్గే ఛాన్స్ ఖచ్చితంగా అందుకే ఎఫ్3 మూవీ కోసం మరో డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. పోటీ నుంచి ఎఫ్ 3 తప్పుకోవడంతో ఆచార్య మేకర్స్ రిలాక్స్ అవుతున్నారు. భారీ విజయాన్ని సాధించిన ఎఫ్2 కి సీక్వెల్ గా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 చిత్రం రూపొందుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు ఈ సారి సునీల్ కూడా యాడ్ అయ్యాడు. ఈ మధ్యే ఓ సాంగ్ రిలీజై ఎట్రాక్ట్ చేసింది. ఇవాళ ఎఫ్3 మేకర్స్…. తమ సినిమాని ఏప్రిల్ 28న కాకుండా మే 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
మే నెలలో 27న రిలీజ్ చేయాలనుకుంటున్న ఎఫ్3 మూవీకి పోటీగా మరో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి రంగరంగ వైభవంగా మూవీ. ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్, కేతికశర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. సినిమా నుంచి చిన్న టీజర్, ఓ లిరికల్ సాంగ్ వచ్చి ఇంప్రెస్ చేశాయి. ఈ సినిమాని కూడా మే 27నే రిలీజ్ చేయడానికి ఈ మధ్యే ఆ మూవీ టీమ్ ప్రకటించింది. ఇక మే 27నే అడవి శేష్ నటిస్తున్న మేజర్ మూవీ వస్తోంది. ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ ఉన్ని సందీప్ కథతో మేజర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి టీజర్ తో పాటు కొన్ని సాంగ్స్ కూడా విడుదలై మూవీపై అంచనాలు పెంచాయి. తెలుగులో ఈ మూవీపై చాలా బజ్ ఉంది. సో… మే 27న మేజర్, రంగరంగ వైభవంగా చిత్రాలతో పాటు ఎఫ్3 కూడా కలెక్షన్లను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకా టైమ్ ఉంది కాబట్టి…మళ్ళీ రిలీజ్ డేట్స్ మారతాయో లేక అదే డేట్ కి ఆ సినిమాలు వస్తాయో చూడాలి.

Related Posts