టాలీవుడ్ లో క్లియరెన్సు సేల్

క్లియరెన్స్ సేల్ .. ఈ మాట ఎక్కువగా అమ్ముడు పోని వస్తువుల విషయంలో వింటుంటాం. ఎక్కువగా క్వాలిటీ లేని వస్తువులకే ఇలా జరుగుతుంది. ఒక్కోసారి సినిమాల విషయంలో కూడా ఇలా జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఇలాంటి క్లియరెన్సు సేల్ జరగబోతోంది. వినడానికి కాస్త ఇబ్బండి గా ఉన్న ఇదే నిజం. అంటే ఒకే రోజు దాదాపు పదకొండు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో చాల సినిమాల గురించి జనానికి పెద్దగా తెలియదు కూడా. అయినా ఈ డేట్ మిస్ ఐతే మళ్ళీ మరో డేట్ రావడానికి వీలు లేదు.
ఈ పదకొండు సినిమాల్లో కొంత ఎక్కువగా తెలిసిన సినిమా మోహన్ బాబు నటించిన సన్ఆఫ్ ఇండియా మాత్రమే. ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తర్వాత లగడపాటి శ్రీధర్ కొడుకు నటించిన వర్జిన్ స్టోరీ అనే మూవీ కూడా ఉంది. అడల్ట్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉండటం తో యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇక వరుసగా ఉన్న సినిమాలు చుస్తే వీటి గురించి కనీసం విని కూడా ఉందాం అనుకోలేం. మరి ఆ చిత్ర రాజలేంటో చూద్దాం..
బ్యాచ్, స్వాతిచినుకు సంధ్య వేళలో, విశ్వక్, నీకు నాకు పెళ్ళంట, సురభి 70 ఎంఎం , గోల్ మాల్, రోమన్, బడవ రాస్కల్ తో పాటు హాలీవుడ్ దుబ్బింగ్ మూవీ అంచార్టెడ్.. అనే చిత్రాలున్నాయి. మరి ఈ సినిమాలను గురించి జనం పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి.