ఏప్రిల్ మాసంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర!

ఈ వేసవిలో పెద్ద సినిమాలు పెద్దగా లేవు. ఈ సమ్మర్ సీజన్ అంతా చిన్న చిత్రాలదే రాజ్యం. మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలో కూల్ ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి ‘ఓం భీమ్ బుష్, టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలు సినిమా హాళ్లలో రెడీగా ఉన్నాయి.

ఇక.. ఈ ఏప్రిల్ మాసంలో థియేటర్లలోకి దిగుతోన్న తొలి చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోన్న చిత్రమిది. వీరిద్దరికి తోడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కలిశాడు. ఇప్పటికే ప్రచారంలో హోరెత్తిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది. విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. లేటెస్ట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

ఏప్రిల్ 5న తెలుగు నుంచి ‘భరతనాట్యం’ సినిమా కూడా విడుదలకు ముస్తాబవుతోంది. సూర్య తేజ ఏలే కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్‌ కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి గోస్వామి ఈ సినిమాలో కథానాయిక.

ఏప్రిల్ మొదటివారంలో మలయాళం నుంచి తెలుగులోకి అనువాద రూపంలో వస్తోంది ‘మంజుమ్మల్ బాయ్స్’. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్స్ రికార్డులు కొల్లగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’ను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయబోతుంది మైత్రీ మూవీ మేకర్స్. లేటెస్ట్ గా రిలీజైన ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 6న ‘మంజుమ్మల్ బాయ్స్’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఏప్రిల్ రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర భారీగానే ఉండబోతుంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిత్రాలు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది, శ్రీరంగనీతులు’. సమ్మర్ పీక్స్ లో ఉండే ఏప్రిల్ నెలలో హారర్ కామెడీతో అలరించడానికి వస్తోంది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలి టైటిల్ రోల్ లో రూపొందిన ఈ సీక్వెల్ మూవీని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సునీల్, ఆలీ, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య వంటి కామెడీ స్టార్స్ ఉన్నారు. అసలు ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేద్దామనుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాని ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

టాలెంటెడ్ యంగ్ యాక్టర్స్ సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్ హీరోలుగా.. రుహానీ శర్మ మరో కీలక పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీరంగనీతులు‘. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ ఈ చిత్రానికి దర్శకుడు. రాధావి ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న ‘శ్రీరంగనీతులు‘ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం, ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఉంది టీమ్. ఇంకా.. ఏప్రిల్ రెండో వారంలోనే ‘లవ్ గురు, రోటి కపడా రొమాన్స్, మెర్సీ కిల్లింగ్, డియర్’ వంటి సినిమాలున్నాయి.

ఇక.. ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో కొంచెం క్రేజున్న చిత్రాలంటే ‘లవ్ మీ, ఆ ఒక్కటి అడక్కు, ప్రతినిధి 2’ చిత్రాల గురించి చెప్పుకోవాలి. వీటిలో దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ‘లవ్ మీ’ ఏప్రిల్ 25న వస్తుంటే.. అల్లరి నరేష్ ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ ‘ఆ ఒక్కటి అడక్కు’ ఇంకా విడుదల తేదీ ఖరారు చేసుకోవాల్సి ఉంది. అలాగే.. నారా రోహిత్ మోస్ట్ అవైటింగ్ ‘ప్రతినిధి 2’ కూడా ఏప్రిల్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇంకా.. ఏప్రిల్ లో సందడి చేసే చిత్రాలలో ‘పారిజాత పర్వం, శశివదనే, రత్నం’ వంటి చిన్న చిత్రాలు కూడ

Related Posts