‘ఫ్యామిలీ స్టార్’ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి

ఈ సమ్మర్ సీజన్ లో సిల్వర్ స్క్రీన్ పై కూల్ ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రెడీ అవుతున్నాయి. లేటెస్ట్ గా థియేటర్లలోకి వచ్చిన ‘టిల్లు స్క్వేర్’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఫుల్ కంటెంట్ తో స్టార్ బాయ్ సిద్ధు నటించిన ‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు వసూళ్లు సాధించే దిశగా దూసుకెళ్లే సూచనలు కనిపిస్తునాయని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ వారంలో థియేటర్లలోకి రాబోతున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీ స్టార్’ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్స్, మల్టీప్లెక్స్ లో టికెట్స్ బుకింగ్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయట. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకులు ఈ వేసవిలో ‘ఫ్యామిలీ స్టార్’ చూడాలనుకుంటున్నారు. అది కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. మరి.. ఓపెనింగ్స్ విషయంలో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

Related Posts