ఎన్టీఆర్(Ntr) టైటిల్ నాది.. నాకు చెప్పుకుండా తీసుకున్నారు.. అంటున్నాడు బండ్ల గణేష్(Bandla Ganesh). నటుడు నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్(Bandla Ganesh) కొన్నాళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు.
వివాదాలకు దగ్గరగా కనిపిస్తున్నాడు. అలాగని అతని గొడవలేం భారీగా ఉండవు. చిన్నవే. కానీ ఎఫెక్టివ్ గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇది గొడవ అనలేం కానీ నిజంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా టైటిల్ మాత్రం అతనిదే అనేది నిజం.
ఎన్టీఆర్(Ntr) – కొరటాల(Koratala) చిత్రానికి దేవర(Devara) అనే టైటిల్ తో ఓ పోస్టర్ వదిలారు. ఎన్టీఆర్ ఇమేజ్ కు ఈ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా బాగా కుదిరిందనే టాక్ వచ్చింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో డిస్కస్ అవుతున్న టైమ్ లో “దేవర.. నేను రిజిష్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు” అంటూ సీరియస్ గా ఉన్న ఓ ఎమోజీ యాడ్ చేశాడు బండ్ల గణేష్.
అయితే ఈ టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని బండ్ల గణేష్((Bandla Ganesh) గతంలోనే చాలాసార్లు చెప్పాడు. అయినా రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను అతనికి చెప్పుకుండా వేరేవారికి ఇవ్వరు కదా..? మరి ఈ వ్యవహారంలో కొరటాల శివ వెర్షన్ ఎలా ఉంటుందో కానీ.. ఈ మధ్య కాలంలోనే బండ్ల గణేష్.. ఎన్టీఆర్ ను తెగ పొగడటం స్టార్ట్ చేశాడు. ఇంతలోనే మళ్లీ టైటిల్ గొడవ షురూ అయింది. గొడవ మేటర్ ఎలా ఉన్నా.. బండ్ల గణేష్ నిర్మాతగా ఎన్టీఆర్ తో బాద్ షా(Bad Sha), టెంపర్(Temper) చిత్రాలు చేశాడు.
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా…
ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.…
స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్…
Young hero Raj Tarun's latest movie is 'Purushothamudu'. Dr. Ramesh Tejawat and Prakash Tejawat are…
చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో 'సినిమా చూపిస్తా…
కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే…