NTR : ఎన్టీఆర్ దేవర టైటిల్ నాది..

ఎన్టీఆర్(Ntr) టైటిల్ నాది.. నాకు చెప్పుకుండా తీసుకున్నారు.. అంటున్నాడు బండ్ల గణేష్(Bandla Ganesh). నటుడు నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌(Bandla Ganesh) కొన్నాళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు.

వివాదాలకు దగ్గరగా కనిపిస్తున్నాడు. అలాగని అతని గొడవలేం భారీగా ఉండవు. చిన్నవే. కానీ ఎఫెక్టివ్ గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇది గొడవ అనలేం కానీ నిజంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా టైటిల్ మాత్రం అతనిదే అనేది నిజం.


ఎన్టీఆర్(Ntr) – కొరటాల(Koratala) చిత్రానికి దేవర(Devara) అనే టైటిల్ తో ఓ పోస్టర్ వదిలారు. ఎన్టీఆర్ ఇమేజ్ కు ఈ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా బాగా కుదిరిందనే టాక్ వచ్చింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో డిస్కస్ అవుతున్న టైమ్ లో “దేవర.. నేను రిజిష్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు” అంటూ సీరియస్ గా ఉన్న ఓ ఎమోజీ యాడ్ చేశాడు బండ్ల గణేష్‌.


అయితే ఈ టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని బండ్ల గణేష్((Bandla Ganesh) గతంలోనే చాలాసార్లు చెప్పాడు. అయినా రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను అతనికి చెప్పుకుండా వేరేవారికి ఇవ్వరు కదా..? మరి ఈ వ్యవహారంలో కొరటాల శివ వెర్షన్ ఎలా ఉంటుందో కానీ.. ఈ మధ్య కాలంలోనే బండ్ల గణేష్.. ఎన్టీఆర్ ను తెగ పొగడటం స్టార్ట్ చేశాడు. ఇంతలోనే మళ్లీ టైటిల్ గొడవ షురూ అయింది. గొడవ మేటర్ ఎలా ఉన్నా.. బండ్ల గణేష్ నిర్మాతగా ఎన్టీఆర్ తో బాద్ షా(Bad Sha), టెంపర్(Temper) చిత్రాలు చేశాడు.

Related Posts