‘గేమ్ ఛేంజర్‘ కొత్త షెడ్యూల్ మొదలైంది

ఈపాటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకోవాల్సిన ‘గేమ్ ఛేంజర్‘ నత్త నడకన సాగుతోంది. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2‘తో బిజీ అవ్వడమే. ఒకవైపు ‘గేమ్ ఛేంజర్‘.. మరోవైపు ‘ఇండియన్ 2‘ చిత్రాలను ప్యారలల్ గా పూర్తిచేస్తున్నాడు గ్రేట్ డైరెక్టర్ శంకర్. ఇప్పటికే ‘ఇండియన్ 2‘ రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తిచేసుకుందట. దాంతో.. ఇకపై ‘గేమ్ ఛేంజర్‘పైనే శంకర్ ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ‘గేమ్ ఛేంజర్‘ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక పాత్రధారులైన శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె. సూర్య లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రెండు, మూడు రోజుల్లో చరణ్ కూడా సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కి జోడీగా కియరా అద్వానీ నటిస్తున్న ఈ మూవీలో అంజలి మరో ఫీమేల్ లీడ్ లో మురిపించబోతుంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రం నుంచి ‘జరగండి..‘ అంటూ సాగే గీతం విడుదలవ్వాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆ పాట విడుదల వాయిదా పడింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్‘ వచ్చే యేడాది ద్వితియార్థంలో విడుదలకానుంది.

Related Posts