ఆర్జీవి ‘వ్యూహం’కి షాక్ ఇచ్చిన హైకోర్టు.. రిలీజ్ వాయిదా

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రం విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. సి.బి.ఎఫ్.సి జారీ చేసిన సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జనవరి 11 కు వాయిదా వేసింది.

‘వ్యూహం’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీ.బీ.ఎఫ్.‌సీ) ఇచ్చిన సర్టిఫికెట్‌ ను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది మురళీధర్‌రావు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీ.బీ.ఎఫ్.సి జారీ చేసిన సర్టిఫికెట్ ను వచ్చే నెల 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.

Related Posts