‘ఈగల్‘ సాంగ్.. రవితేజ రొమాంటిక్ మెలోడీ ‘గల్లంతే.. దిల్లంత‘

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఈగల్‘ ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే ఐనదే‘ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీని రిలీజ్ చేశారు. డావ్ జాంద్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని కపిల్ కపిలన్, లిన్ ఆలపించారు. రవితేజ, కావ్యథాపర్ పై చిత్రీకరించిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘ఈగల్‘ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రవితేజాకి జోడీగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఈగల్‘ ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరోవైపు.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్‘ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Related Posts