తెలుగు డైరెక్టర్.. తమిళ్ హీరో.. కన్నడ ప్రొడ్యసర్.. ఓ భారీ మూవీ

తెలుగు డైరెక్టర్.. తమిళ్ హీరో.. కన్నడ ప్రొడ్యసర్.. వినడానికి ఈ మాటలు ఎంత బావున్నాయో కదూ.. యస్.. ఈ వెరైటీ కాంబినేషన్ లో మరో భారీ సినిమా రాబోతోంది. అది కూడా కెజీఎఫ్ ప్రొడ్యూసర్స్ నిర్మించబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో విశేషం ఏంటంటే.. ఈ హీరోకు ఆ డైరెక్టర్ ఆల్రెడీ ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద సౌత్ అయిపోయింది. ఇంతకీ ఆ హీరో, డైరెక్టర్ ఎవరనే కదా మీ డౌట్..


కెజీఎఫ్.. దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ క్రేజ్ తెచ్చుకున్న సినిమా. ఫస్ట్ పార్ట్ కంట్రీ షేక్ చేస్తే.. సెకండ్ పార్ట్ కలెక్షన్స్ తో షేక్ చేస్తోంది. ఈ రెండు సినిమాలతోనే ఆ మూవీ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పేరు కూడా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.ఓ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఎనిమిదేళ్లు కష్టపడటం అంటే చిన్న విషయం కాదు కదా.. అందుకే ఆ బ్యానర్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా.. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. వారి ఆసక్తిని ఆశ్చర్యంగా కూడా మార్చి తమ తర్వాతి ప్రాజెక్ట్ ను ఊహించన కాంబినేషన్ తో అనౌన్స్ చేసింది హొంబలే ఫిల్మ్స్ బ్యానర్.


తెలుగు మూలాలున్నా.. తమిళ్ లో డైరెక్టర్ అయిన లేడీ సుధా కొంగర. చాలాయేళ్ల క్రితమే డైరెక్టర్ గా మారిన సుధ.. ఆ మధ్య మాధవన్ హీరోగా నటించిన సాలాఖడూస్ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యారు. తర్వాత సూర్య హీరోగా రూపొందించిన ఆకాశం నీ హద్దురాతో ఆమె టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలైనా ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యేలా తను తీర్చి దిద్దారు. ఇది బయోపిక్ గానే వచ్చినా.. మంచి స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంది సుధా కొంగర. ఇప్పుడు కెజీఎఫ్ నిర్మాతల తర్వాతి దర్శకురాలు సుధా కొంగరే.


హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో హీరోగా నటించబోతోంది ఎవరో తెలుసా..? సూర్య. యస్.. ఈ ఇద్దరి కాంబోలో ఆల్రెడీ వచ్చిన ఆకాశం నీ హద్దురా గురించి అందరికీ తెలుసు. ఈ సారి ఇండియాలో జరిగిన ఓ పెద్ద ఇష్యూను తమ కథగా తీసుకున్నారట. అంటే వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథన్నమాట. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే.. ఈ అనౌన్స్ మెంట్ లో హీరోను ప్రస్తావించలేదు నిర్మాణ సంస్థ. కానీ ఇప్పటికే తమిళ్ సినిమా పరిశ్రమ నుంచి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తోన్నట్టుగా వార్తలు రాశాయి. అక్కడి టాప్ ఫిల్మ్ అనలిస్ట్ లు కూడా సుధ, సూర్య, హొంబలే బ్యానర్ లో సినిమా కన్ఫర్మ్ అని చెబుతున్నారు. మరి ఈ సారి ఏ నేపథ్యంలో వస్తోందో కానీ.. ఖచ్చితంగా ఇదీ రికార్డులు బ్రేక్ చేసే సినిమానే అవుతుందంటున్నారు.

Related Posts