ఖైదీలో పోలీస్ ను లేడీగా మార్చారు

ఒక సినిమాను రీమేక్ చేస్తే మార్పులు అనివార్యం. అయితే కథలో కీలకమైన మార్పులు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిస్కే అని చెప్పాలి. అలాగని పూర్తిగా రిస్క్ అని చెప్పలేం. కాకపోతే ఒరిజినల్ లో మేజర్ ప్లస్ అయిన క్యారెక్టర్స్ మారిస్తే ఫీల్ మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్లామర్ కోసం చేశారా లేక.. కాంబినేషన్ క్రేజ్ కోసం చేస్తున్నారా అని చెప్పలేం కానీ..కార్తీ ఖైదీ సినిమా హిందీ రీమేక్ లో ఓ కీలకమైన మార్పు చేశారట. దీంతో ఓ మేజర్ రోల్ కు టబు వచ్చేసింది.

ఖైదీ.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా వచ్చిన సినిమా. సినిమా ప్రధానంగా ఒకే రాత్రిలో ముగిసిపోతుంది. కానీ ఆ కథనాన్ని అద్భుతమైన గ్రిప్పింగ్ తో నడిపించాడు దర్శకుడు. దీంతో సౌత్ మొత్తానికి ఖైదీ విపరీతంగా నచ్చేసింది. ఏకంగా తమిళ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. ఓ చిన్న పాప కోసం అల్లుకున్న చిన్న ఎమోషనల్ థ్రెడ్ కు డ్రగ్ మాఫియాను యాడ్ ఓ పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు. కార్తీ నటనతో పాటు అతనితో పాటు సినిమా అంతా కనిపించిన మరో పాత్ర కార్తీక్ నరేన్ ది. పోలీస్ ఆఫీసర్ గా కార్తీని బెదిరించి.. ఆపై స్నేహంగా లారీని నడిపించే పాత్రలో బాగా నటించాడతను.
ఖైదీ సినిమాను హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగ రీమేక్ చేస్తున్నారు. అక్కడ ‘భోలా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. భాషను బట్టి కథ, కథానాన్ని మార్చాల్సిన అవసరం లేని స్క్రిప్ట్ ఇది. అందుకే అక్కడ కథలో ఏమైనా మార్పులు చేస్తున్నారా లేదా అని చెప్పలేం కానీ.. పాత్రల్లో మాత్రం మార్పులు జరిగాయి. కార్తీక్ నరేష్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను టబుతో చేయిస్తున్నారు. గతంలో అజయ్, టబుల జోడీకి బాలీవుడ్ లోమంచి క్రేజ్ ఉంది.

ఇద్దరి కాంబోలో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో ఈ ఇద్దరూ అలరిస్తున్నారు.. ఆ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి కూడా. ఈ కారణంగానే టబు ఈ సినిమాలోకి ఎంటర్ అయిందనుకోవచ్చు.
ఖైదీ సినిమాలో కార్తీక్ నరేన్ పాత్ర చాలా కీలకం. ఆ ప్రాధాన్యతను టబు కూడా ఫుల్ ఫిల్ చేయగలదు కాబట్టే.. ఆ పోలీస్ పాత్ర కోసం టబును తీసుకున్నారు. పోలీస్ క్యారెక్టర్ లో టబు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది కాబట్టి.. ఈ కాంబో అక్కడ మరోసారి సూపర్ హిట్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఇది కేవలం పాత్రనే మార్చారా లేక ఆ పాత్రల మధ్య ఇంకేదైనా కెమిస్ట్రీ యాడ్ చేశారా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఏదేమైనా ఖైదీ కార్తీ కెరీర్ లోనే ఓ మెమరబుల్ మూవీ.. మరి అజయ్ దేవ్ గణ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Related Posts