బాహుబలి2, ఆర్ఆర్ఆర్ ను దాటలేకపోయిన కెజీఎఫ్2

ఒకప్పుడు సినిమాలంటే ఏది ఎక్కువ హండ్రెడ్ డేస్ ఆడింది.. ఎన్ని సెంటర్స్ లో ఆడింది అని చూసేవారు. ఇప్పుడు కలెక్షన్సే సినిమాల కెపాసిటీని నిర్ణయించే కొలమానం అయ్యాయి. అందులోనూ పెద్ద పోటీ భారీ బడ్జెట్ సినిమాల మధ్యే ఉంటోంది. అలా ఈ దశాబ్దంలో సౌత్ నుంచి భారీ బడ్జెట్ తో పాటు ప్యాన్ ఇండియన్ మూవీస్ అనే కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన మూడు సినిమాల కలెక్షన్స్ గురించి అన్ని సోషల్ మీడియంలో నానా హంగామా నడుస్తోంది. మరి ఈ మూడు సినిమాల మొదటి వారం ఒరిజినల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

బాహుబలి బాటలో వెళ్లి భారీ విజయాన్న సొంతం చేసుకుంది కెజీఎఫ్. ఎవరూ ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుందీ చిత్రం. ఇక లేటెస్ట్ గా వచ్చిన రెండో చాప్టర్ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. దీంతో ఈ సినిమా కొన్ని చోట్ల కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో మాత్రం మన తెలుగు సినిమాలను దాటలేకపోయింది. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. కెజీఎఫ్ చాప్టర్ 2 మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిన అమౌంట్ 357.01 షేర్ గా ఉంటే.. 719.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కూడా బాక్సాఫీస్ ను ఊపేసిందనే చెప్పాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల అద్భుత నటనకు తోడు అదిరిపోయే ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ఆర్ఆర్ కు అఖండ విజయాన్ని ఇచ్చాయి. ఇక ఈ మూవీ ఫస్ట్ వీక్ ప్రపంచ వ్యాప్తంగా చేసిన కలెక్షన్స్ .. 392.85 కోట్ల షేర్ అయితే.. 710 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది. అంటే మొదటి వారం కలెక్షన్స్ లో కెజీఎఫ్2 ఆర్ఆర్ఆర్ ను దాటలేదన్నమాట. రెండు సినిమాల మధ్య 35కోట్ల షేర్ తేడా ఉంది.

ఇక ఈ రెండు సినిమాలు ఇప్పుడు కొట్టుకుంటున్నాయి కానీ.. ఇద్దరూ ముందు వచ్చిన బాహుబలి2ను దాటలేకపోవడం విశేషం. బాహుబలి2 మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్లు.. 430 కోట్లు షేర్ అయితే.. 835 కోట్ల గ్రాస్ గా ఉంది. అంటే ఇప్పటికీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో నెంబర్ వన్ పొజిషన్ బాహుబలి2దే ఉంది. ఈ చిత్ర వసూళ్లు చూస్తే ఆర్ఆర్ఆర్ కు 38కోట్లు తేడా ఉంటే.. కెజీఎఫ్2.. 73 కోట్లు వెనక బడి మొదటి వారం కలెక్షన్ల రికార్డులో మూడో స్థానంలో నిలిచిందన్నమాట. అయితే ఊపు చూస్తోంటే కెజీఎఫ్2 ఇంకా సత్తా చాటే అవకాశాలున్నాయి. సో.. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి2, సెకండ్ ప్లేస్ ఆర్ఆర్ఆర్, థర్డ్ ప్లేస్ లో కెజీఎఫ్2 నిలిచాయన్నమాట. విశేషం ఏంటంటే.. ఈ లిస్ట్ లో బాలీవుడ్ సినిమాలేం లేవు.

Related Posts