పాజిటివ్ వైబ్స్ తో ప్రారంభమైన ‘తండేల్’

అక్కినేని నవ యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా’తండేల్’. ‘కార్తికేయ2’తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఎక్కువ సమయం కేటాయించిన టీమ్.. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా.. ఈ చిత్రం ముహూర్తం జరుపుకుంది.

నాగచైతన్య తండ్రి నాగార్జున, మేనమేమ వెంకటేష్ సమక్షంలో ‘తండేల్’ చిత్రం గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకుంది. ఒకవిధంగా మంచి హిట్ కాంబినేషన్స్ మధ్య పాజిటివ్ వైబ్స్ తో ఈ సినిమా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ సినిమా ముహూర్తానికి హాజరైన నాగార్జున, వెంకటేష్ ఇద్దరితోనూ మంచి విజయాలందుకున్నాడు చైతన్య. తండ్రి నాగ్ తో నటించిన ‘మనం, బంగార్రాజు’ హిట్స్ గా నిలవగా.. మావయ్య వెంకటేష్ తో చేసిన ‘వెంకీమామ’ సూపర్ హిట్ అయ్యింది. ఇక.. ఇప్పుడు ‘తండేల్’ దర్శకుడు చందూ మొండేటి గతంలో నాగచైతన్యతో చేసిన ‘ప్రేమమ్’ సినిమాలోనూ వెంకీ, నాగ్ ఇద్దరూ అతిథులుగా మురిపించారు.

మరోవైపు హీరోయిన్ సాయిపల్లవితో నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ కూడా హిట్టే. నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తోనూ చైతన్యకి సూపర్ హిట్ బాండింగ్ ఉంది. ఇదే కాంపౌండ్ లో చైతూ చేసిన ‘100 పర్సెంట్ లవ్’ సూపర్ హిట్ డూట్. త్వరలో పట్టాలెక్కే ‘తండేల్’ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. మొత్తంగా.. ‘దూత’ సిరీస్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన చైతన్య.. ఇప్పుడు ‘తండేల్’తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related Posts

</