గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్స్

2023వ సంవత్సరం కొంతమంది స్టార్ హీరోలకు మెమరబుల్ ఇయర్ గా నిలిచింది. కొన్నేళ్లుగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ గ్రేట్ కమ్ బ్యాక్ గా ఇయర్ అయ్యింది. తెలుగు నుంచి అలాంటి గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్ ప్రభాస్.

‘బాహుబలి’ సిరీస్ తో భారతీయ చలన చిత్ర సీమలోనే సరికొత్త రికార్డులు లిఖించిన హీరో ప్రభాస్. అయితే.. ‘బాహుబలి’ తర్వాత బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మేనియా అంతలా పనిచేయలేదు. భారీ అంచనాలతో వచ్చిన ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్’ తీవ్రంగా నిరాశపరిచాయి. వీటిలో ‘సాహో’ హిందీ బెల్ట్ లో మంచి వసూళ్లు సాధించింది.

ఇక ఆరేళ్లుగా అసలు సిసలు హిట్ కోసం ఎదురుచూసిన ప్రభాస్ కి ‘సలార్’ రూపంలో ఆ విజయం దక్కింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించి.. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ‘సలార్’ దూసుకెళ్తుంది. మరోవైపు ఓవర్సీస్ లో ఇప్పటికే 5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ‘బాహుబలి 1, బాహుబలి 2’ తర్వాత అమెరికాలో మూడోసారి 5 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన హీరో ప్రభాస్. అలాగే.. ఆ ఘనత దక్కించుకున్న ఏకైన సౌతిండియన్ హీరో కూడా. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘సలార్’ ఈజీగా వెయ్యి కోట్లు క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

తెలుగు నుంచి ప్రభాస్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తే.. తమిళం నుంచి ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. 2010లో విడుదలైన ‘రోబో’ తర్వాత రజనీకాంత్ నుంచి వచ్చిన సినిమాలేవీ భారీ విజయాలు సాధించలేదు. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన ‘జైలర్’.. సూపర్ స్టార్ కి సూపర్ కమ్ బ్యాక్ అందించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ నటనకు ప్రేక్షకులు అయ్యారు. ఏడు పదుల వయసులోనూ అదే స్టైల్.. అదే ఎనర్జీతో ఆన్ స్క్రీన్ పై అదరగొట్టి.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు కొల్లగొట్టాడు.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కి కూడా 2023 చాలా మెమరబుల్. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మూవీతో బాలీవుడ్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన షారుక్.. ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయం కోసం పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఒకటి కాదు.. షారుక్ కి రెండు బడా బ్లాక్ బస్టర్స్ దక్కాయి. ప్రథమార్థంలో వచ్చిన ‘పఠాన్’.. ద్వితియార్థంలో విడుదలైన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద వెయ్యేసి కోట్లు వసూలు చేసి కింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చేశాయి. అయితే.. ఇటీవల క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘డంకి’ మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోతుంది.

Related Posts