ఐదో వారంలోకి ఎంటరైనా బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్‘ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్.. రణ్ బీర్ యాక్టింగ్.. బాబీ డియోల్ విలనిజం కలగలిపి ‘యానిమల్’ని బాక్సాఫీస్ బొనాంజా గా నిలబెట్టాయి. 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చిన ఈ చిత్రానికి.. లెంత్ సమస్యే కాలేదు. ఓ కల్ట్ మూవీగా ‘యానిమల్’ కలెక్షన్ల వర్షం కురిపించింది.
థియేట్రికల్ రన్ పూర్తవుతుండడంతో.. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ చిత్రం.
ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ నెట్ ఫ్లిక్స్ వెర్షన్ ని రెడీ చేస్తున్నాడట. మొత్తంగా 3 గంటల 30 నిమిషాల నిడివితో రావాల్సిన ‘యానిమల్’ని థియేటర్ల కోసం 9 నిమిషాలు తగ్గించారు. ఇప్పుడు పూర్తి నిడివితో నెట్ ఫ్లిక్స్ వెర్షన్ రెడీ అవుతోందట. ఈ చిత్రానికి ఎడిటర్ కూడా తానే కావడంతో ఆ మిగిలిన సన్నివేశాలను మరింత రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నాడట సందీప్ రెడ్డి. గతంలో ‘అర్జున్ రెడ్డి’ విషయంలోనూ ఇదే జరిగింది. థియేటర్లలో చూడని కొత్త సన్నివేశాలతో ‘అర్జున్ రెడ్డి’ ఓటీటీ వెర్షన్ విజువల్ ట్రీట్ అందించింది. మొత్తంమీద.. మరింత వైలెంట్ గా ‘యానిమల్’ నెట్ ఫ్లిక్స్ వెర్షన్ రెడీ అవుతుందన్న మాట.