SSMB28 : మహేష్‌ బాబు మాస్ లుక్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లోరూపొందుతోన్న సినిమా నుంచి ఒక లుక్ విడుదల చేశాడు సూపర్ స్టార్. ఓ ఊరమాస్ ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్ ఇది. రెడ్ కలర్ చెక్స్ షర్ట్ లో నెత్తికి ఎర్రని రుమాలు చుట్టుకుంటూ ఫైట్ కు సిద్ధమవుతున్నట్టుగా ఉన్న ఈ లుక్ చూడగానే అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఈ లుక్ ను తండ్రి సూపర్ స్టార్ కృష్ణగారికి అంకితం ఇస్తున్నట్టుగా చెప్పాడు మహేష్‌.

ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి .. “ఇవాళంతా ప్రత్యేకమైనదే. ఇది నీ కోసమే నాన్నా..” అని రాశాడు. ఇవాళ కృష్ణగారి జయంతి కూడా కావడంతో ఆ సందర్భంగా ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్నీ రీ రిలీజ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ మూవీతో పాటే మహేష్‌ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ తోపాటు వీడియో గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తున్నారు. మొత్తంగా దానికంటే ముందే ఫ్యాన్స్ కు ఈ స్టిల్ తో ట్రీట్ ఇచ్చాడుమహేష్‌.

Related Posts