Kamal hassan : ప్రభాస్ కు విలన్ గా కమల్ హాసన్

పాత్ర నచ్చితే ఎలాంటి రోల్ కైనా ఓకే చెప్పే నటుడు కమల్ హాసన్. హీరోఅయినా విలన్ అయినా దాన్ని పాత్రగానే చూస్తాడు తప్ప తన ఇమేజ్ ను బట్టి బేరీజు వేసుకోడు. అందుకే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా వినిపిస్తోన్న బజ్ వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రభాస్ కు విలన్ గా కమల్ హాసన్ నటిస్తున్నాడు అని.. ఇది నిజమా అనే ఆరాలు అప్పుడే మొదలయ్యాయి. పైగా ఇప్పుడు ప్రభాస్ కు ఉన్న క్రేజ్ చూస్తే మామూలుగా లేదు. ఆక్రేజ్ ను కంట్రీ మొత్తం ఎప్పుడో తెచ్చుకున్నాడు కమల్ హాసన్.

దేశం గర్వించదగ్గ నటుడుగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి కమల్ హాసన్ .. ప్రభాస్ కు విలన్ గా నటిస్తాడా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కానీ ముందే చెప్పినట్టు ఆయనకు పాత్ర నచ్చితే ప్రభాస్ అయినా ఇంకెవరైనా అనేది చూడడు. బట్.. కమల్ హాసన్ ను ముందు నిలిచే సత్తా నటుడుగా ప్రభాస్ కు ఉందా అనేదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలు, సమాధానాలు పక్కన బెడితే నిజంగానే కమల్ హాసన్ కు ఈ ఆఫర్ వెళ్లింది.


నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’ లో విలన్ పాత్ర ఆఫర్ ముందుగా కమల్ హాసన్ వద్దకే వెళ్లిందిట. అంతే కాదు.. 150 కోట్ల భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు టాక్. కానీ కమల్ ఎందుకో యస్ చెప్పలేదు. కథ నచ్చలేదా లేక ఇతర కమిట్మెంట్స్ వల్లనా అనే క్లారిటీ ఇంకా రాలేదు. బట్ ఈ ఆఫర్ మాత్రం కమల్ వరకూ తీసుకువెళ్లారట. ప్రస్తుతం ఇంకా డిస్కషన్స్ లోనే ఉంది అని కూడా చెబుతున్నారు.

మరో విశేషం ఏంటంటే కమల్ హాసన్ కేవలం నెల రోజుల డేట్స్ ఇస్తే చాలు అని కూడా చెప్పారట. అంటే నెల రోజులకు 150 కోట్లు ఆఫర్ చేశారు అనుకోవాలి. ఇక్కడే చాలామంది ఈ కాంబినేషన్ గురించి అనుమాన పడుతున్నారు. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతం రూమర్ గానే వినిపిస్తోంది. నిజమవుతుందా లేదా అనే కంటే నిజమైతే బావున్ను అనుకుందాం.

Related Posts