ప్రియాంక లక్ మామూలుగా లేదు

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. సక్సెస్ లో ఉన్న వాళ్లకే క్రేజీ ఆఫర్స్ వస్తుంటాయి. అయితే.. విజయాల విషయంలో వెనుకబడే ఉన్నా.. అవకాశాల విషయంలో మాత్రం తన కాంటెంపరరీస్ కంటే ముందే వుంది ప్రియాంక అరుళ్ మోహన్. నాలుగేళ్ల క్రితం ఓ కన్నడ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై బ్యూటీ..

అదే సమయంలో నాని ‘గ్యాంగ్ లీడర్‘తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ‘గ్యాంగ్ లీడర్‘ ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత తెలుగులో చేసిన ‘శ్రీకారం‘ విజయాన్ని సాధించలేదు. మరోవైపు.. తమిళంలో శివకార్తికేయన్ తో ‘డాక్టర్, డాన్‘, సూర్య తో ‘ఈటీ‘ వంటి సినిమాలు చేసింది. వీటిలో సూర్య సినిమా తప్పితే.. శివకార్తికేయన్ తో మంచి విజయాలే దక్కాయి.

తెలుగులో ట్రాక్ రికార్డ్ అంతగా లేకపోయినా.. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇక.. నానితో ‘గ్యాంగ్ లీడర్‘ తర్వాత ‘సరిపోదా శనివారం‘ సినిమాలోనూ జోడీ కడుతోంది. ‘ఓజీ, సరిపోదా శనివారం‘ రెండు సినిమాలనూ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలతో పాటు..

లేటెస్ట్ గా మాస్ మహారాజ రవితేజాతోనూ హీరోయిన్ గా నటించే ఛాన్సెస్ ఉన్నాయి. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ధనుష్ పాన్ ఇండియా మూవీ ‘కెప్టెన్ మిల్లర్‘లోనూ ఈమె హీరోయిన్. ఈరోజు (నవంబర్ 20) ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ, సరిపోదా శనివారం‘ టీమ్స్ ఈమెకు బర్త్ డే విషెస్ తెలియజేశాయి.

Related Posts