చైతన్య, తమన్నా ప్రాంక్ వీడియో

మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఒక్కొక్కరిగా డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈకోవలోనే నాగచైతన్య కూడా ‘ధూత‘ సిరీస్ తో వెబ్ దునియాలో దుమ్మురేపడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా.. అమెజాన్ ఫ్యామిలీలోకి చైతూని వెల్కమ్ చేస్తూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది.

ఇప్పటికే ‘జీ కర్దా‘ సిరీస్ చేసి అమెజాన్ ఫ్యామిలీలో భాగమైన తమన్నా తో చైతన్యను ఆటపట్టించేలా ఓ ప్రాంక్ వీడియోని సిద్ధం చేశారు. ఈ వీడియోలో ‘ముంబైలోని ఓ సెట్ లో మేకప్ వేసుకుంటూ సడెన్ గా అదే సెట్ లోకి అడుగుపెట్టిన చైతూని చూసి సర్ప్రైజ్ అవుతోంది తమన్నా. ముంబైలో ఏంటి నువ్వు.. నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చావా? అంటోంది. అయితే.. నా సెట్ లో నువ్వేం చేస్తున్నావు అంటూ చైతూ తమన్నాని అడగడం.. లేదు ఇది నా సెట్ అంటే నా సెట్‘ అంటూ.. ఇద్దరూ ఫన్నీగా గొడవపడడం ఈ వీడియోలో ఆకట్టుకుంటుంది.

కట్ చేస్తే.. వెల్కమ్ టు అమెజాన్ ఫ్యామిలీ అంటూ నాగచైతన్యని తమ్మూ వెల్కమ్ చేస్తుంది. అయితే.. తమన్నా ఇలా ఓ హిల్లేరియస్ ప్రాంక్ ప్లాన్ చేసింది అంటూ తనకు ముందే తెలిసినట్టు చైతన్య ఓ లెటర్ తమన్నా చేతిలో పెట్టడం ఈ వీడియోలో కొసమెరుపు. అంటే చైతన్యను ప్రాంక్ చేయబోయి తానే ప్రాంక్ అయిన తమన్నా అని చెప్పొచ్చు. మొత్తంమీద.. ‘ధూత‘ ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. మరి.. నాగచైతన్య డెబ్యూ సిరీస్ ఏ రీతిలో అలరిస్తుందో చూడాలి.

Related Posts