‘లియో‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘లియో‘. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. విజయ్ క్రేజ్ తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ దాదాపు రూ. 650 కోట్లు వసూళ్లు సాధించింది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేయడంతో థియేటర్ల సంఖ్య కూడా భారీగానే దక్కింది.
విడుదలైన చాలా తక్కువ రోజుల్లోనే ‘లియో‘ తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించడం మరో విశేషం.

లేటెస్ట్ గా ‘లియో‘ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్ వేదికగా తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘లియో‘ అందుబాటులోకి రాబోతుంది. నవంబర్ 24 నుంచి ఇండియాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోన్న ‘లియో‘.. నవంబర్ 28 నుంచి గ్లోబల్ లెవెల్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష నటించింది. ఇతర ప్రధాన పాత్రల్లో సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్ కనిపించారు.

Related Posts