పూజా హెగ్డేకి తెలుగులో ఛాన్స్.. పదేళ్ల తర్వాత ఆ హీరోతో సినిమా

చిత్ర పరిశ్రమలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో? ఎవరూ ఊహించడం కష్టం. నిన్నటివరకూ తెలుగు స్టార్ హీరోయిన్స్ లో చోటు సంపాదించుకున్న పూజా హెగ్డే.. సడెన్ గా మాయమైంది. తెలుగులో ‘గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. కారణాలేమైనా.. పూజా మాత్రం చాన్నాళ్లుగా ఖాళీగానే ఉంది.

కట్ చేస్తే.. ఇప్పుడు ఈ కన్నడ కస్తూరి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వబోతుందట. ఈ లిస్టులో ఓ తెలుగు సినిమా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా యువ సామ్రాట్ నాగచైతన్య తో. సరిగ్గా పదేళ్ల క్రితం చైతన్యతోనే ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. మళ్లీ ఇప్పుడు పదేళ్ల తర్వాత చైతూతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి రెడీ అవుతుందట.

‘విరూపాక్ష’తో ఘన విజయాన్నందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు.. నాగచైతన్య తో ఓ సోషియో ఫాంటసీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట. ‘తండేల్’ తర్వాత నాగచైతన్య కార్తీక్ దండు చిత్రంలో నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది.

Related Posts