‘పుష్ప 2’ నుంచి మాస్ జాతర షురూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ ఎంటర్ టైనర్ ‘పుష్ప’. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన ఫస్ట్ పార్ట్ ‘పుష్ప.. ది రైజ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో తగ్గేదే లే అంటూ కలెక్షన్ల సునామీ సృష్టించింది ‘పుష్ప 1’. ఇప్పుడు పార్ట్ 2 తో మరోసారి బాక్సాఫీస్ దుమ్ముదులపడానికి ముస్తాబవుతున్నాడు పుష్ప రాజ్.

ఈ ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప.. ది రూల్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ‘పుష్ప 2’ ప్రచారంలో స్పీడు పెంచబోతున్నారు మేకర్స్. ఏప్రిల్ మాసంలో అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా కలిసి రావడంతో ఈ సినిమా నుంచి ఓ మాస్ జాతరకు సంబంధించిన క్రేజీ అప్డేట్ అందించబోతున్నారు. రేపు (ఏప్రిల్ 2) ‘పుష్ప మాస్ జాతర’ బిగిన్ అవుతుందంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే.. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే స్పెషల్ గానే ఆ మాస్ జాతర స్పెషల్ గ్లింప్స్ విడుదలకానున్నట్టు రేపు అనౌన్స్ మెంట్ రాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి

Related Posts