హీరోయిన్ ను లాక్ చేసిన పవన్ కళ్యాణ్‌

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌస్ అంటే కొన్న్ని మాత్రమే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నవి ఉన్నా.. వారి సక్సెస్ రేట్ చాలా తగ్గింది. అయితే ప్రతి సినిమాతోనూ మాగ్జిమం మెప్పిస్తూ వస్తోన్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. హారిక హాసిని సంస్థకు రెండో బ్యానర్ గా మొదలైందీ సంస్థ. ఫస్ట్ బ్యానర్ కేవలం త్రివిక్రమ్ తో మాత్రమే సినిమాలు చేస్తుంది. సితార అలా కాదు.

అప్ కమింగ్ హీరోల నుంచి పవన్ కళ్యాణ్‌ వరకూ ఎవరైనా రెడీ.. అంటుంది. పైగా కొత్త కాంబినేషన్స్ చేయడం ఈ సంస్థకు ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి. అయితే కొన్నేళ్ల క్రితం సురేష్‌ ప్రొడక్షన్స్ వంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు హీరో, హీరోయిన్ల డేట్స్ ను బల్క్ గా తీసుకునేవారు. వాల్లు సినిమాలు చేసినా చేయకున్నా.. ఆయా హీరోయిన్ల డేట్స్ కావాలంటే ఈ నిర్మాణ సంస్థలనే అడగాలన్నమాట.

ఈ సంప్రదాయాన్ని దాసరి వంటి వారు కూడా పాటించారంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ సంప్రదాయానికి తెరలేపింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. కాకపోతే వీళ్లు కేవలం డేట్స్ మాత్రమే లాక్ చేయరు. సినిమాలు కూడా సెట్ చేస్తున్నారు. అలా ఇప్పుడు యంట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీలతో ఏకంగా వరుసగా నాలుగు సినిమాలు చేస్తోందీ నిర్మాణ సంస్థ. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. మళ్లీ ఆనాటి సంప్రదాయం కనిపిస్తోంది వీరిలో.


ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్‌ చేస్తోన్న సినిమాలో శ్రీ లీల ఓ హీరోయిన్. అఫ్‌ కోర్స్ ఈ మూవీ హారిక హాసినిలో వస్తోంది. అయినా సితార కూడా భాగస్వామి కదా. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఓ రాజు అనే సినిమా చేస్తోందీ బ్యానర్. ఇందులో శ్రీ లీలే హీరోయిన్. ఇక కొన్నాళ్ల క్రితం మొదలైన ఉప్పెన కుర్రాడు వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాలో హీరోయిన్ కూడా తనే. అదీ ఈ బ్యానర్ లోనే. పైగా ఈ కొత్త కుర్రాడిపై భారీ బడ్జెట్ కూడా పెడుతోందట ఈ సంస్థ.


ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్నది ఏంటంటే.. సితార బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా శ్రీ లీలనే సెట్ చేశారట. అంటే వరుసగా ఇదే బ్యానర్ లో ఏకంగా నాలుగు సినిమాలున్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో.. ఇంకా చెబితే ఈ దశాబ్దంలోనే ఇలా ఒకే బ్యానర్ లో వరుసగా నాలుగు సినిమాలు చేస్తోన్న ఏకైక బ్యూటీగా శ్రీ లీలనే చెప్పాలి. ఏదేమైనా అమ్మడు ఎంట్రీతోనే ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది కదా.. అందుకే లక్ లక్కలా అతుక్కుందన్నమాట.

Related Posts