Categories: Latest

నిర్మాతల పాలిట విలన్ గా మారిన పవన్ కళ్యాణ్

టాలీవుడ్ టాప్ హీరోస్ లో కలెక్షన్స్, హిట్స్ సంగతి ఎలా ఉన్నా.. ఫ్యాన్ బేస్ లో పవన్ కళ్యాణ్ ను కొట్టేవాడు లేడు అనేది పచ్చి నిజం. ఆయన బిలోయావరేజ్ సినిమాలకూ మంచి కలెక్షన్స్ వచ్చిన సందర్భాలున్నాయి. కేవలం తెలుగుకే పరిమితం అయినా.. పవన్ క్రేజ్ కు ను ఇతర హీరోలు కూడా కుళ్లుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిర్మాతల పాలిటి విలన్ గా మారాడు. ఫ్యాన్స్ కు కోపం వచ్చినా ఇదే నిజం. యస్.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను చూసి అతను సినిమాకు కమిట్ కాగానే ఎగిరిగంతేసిన వారు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కారణం అతను ఎప్పుడు సినిమా షూటింగ్ కు వస్తాడో తెలియదు. వచ్చినా అప్పటికి ఆ సినిమా గెటప్ తో ఉంటాడో అర్థం కాదు. అందుకోసం కొన్ని రోజులు ప్లాన్ చేసుకుని తీరా షూటింగ్ అనగానే అనకాపల్లిలో ఏదో ఇష్యూ అనో లేక అమలాపురంలో ఏదో జరిగిందనో మళ్లీ పొలిటికల్ సీన్ లోకి ఎంటర్ అయిపోతున్నాడు. దీంతో పాపం అప్పటికే షూటింగ్ కు సిద్ధం చేసుకున్న నిర్మాతలకు భారం ఎక్కువైపోతోంది.

ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ కోసం ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఎప్పుడు టైమ్ ఇస్తాడో ఎవరికీ తెలియదు. అందుకే ‘‘ ఆరు నెలలు ఎదురుచూస్తే మూడు రోజులు టైమ్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్’’ అని ఆ చిత్రానికి సంబంధించిన వారు తెలిసిన వారి దగ్గర వాపోతున్నారు. ఇలాగైతే నిర్మాతలు నిండా మునుగుతారు అన్న ఇంగితం పవన్ కు లేకపోవడం విచారకరం. ఇప్పుడు తను ఏదైతే పవర్ స్టార్ గానో లేక పొలిటికల్ పార్టీ వరకూ ఎదిగాడో అందుకు కారణం కేవలం నిర్మాతలే. వారిని ఏడిపిస్తూ తను ఏదో సమాజోద్ధరణ చేస్తున్నాను అనుకుంటే ఖచ్చితంగా తప్పే అవుతుంది. నిర్మాతల బాధలు పట్టని వారెవరూ ఎప్పటికీ స్టార్స్ అనిపించుకోరు.
ఇక మరోవైపు హరీష్ శంకర్ సినిమా నిర్మాతలదీ ఇదే పరిస్థితి. ఎప్పుడు వస్తాడో తెలియదు. అసలు హరిహర వీరమల్లు పూర్తి కావడానికే ఇంకా చాలా టైమ్ ఉంది. అందుకే ఈ చిత్ర మేకర్స్ రిలీజ్ డేట్ గురించి ఎవరికీ ఏం చెప్పుకోలేకపోతున్నారు. ఇక పవన్ తీరు చూసిన ఇతర నిర్మాతలు మెల్లగా జారుకోవాలనుకుంటున్నారట. అలా చేస్తే మళ్లీ భవిష్యత్ లో ఏం ముంచుకొస్తుందో అని భయపడుతూ.. ఆగిపోతున్నారట..

మొత్తంగా పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని బరిలోకి దిగిన నిర్మాతలంతా ఇప్పుడు భోరుమనే పరిస్థితిలో ఉన్నారు. అయినా కమిట్మెంట్ నిలబెట్టుకోలేనప్పుడు అసలు కమిట్ అవడం ఎందుకు.. ఇలా ఇతరుల జీవితాలతో ఆడుకోవడం ఎందుకూ.. అని అనుకుంటున్నారు నిర్మాతల బాధలు తెలిసి సినిమా జనం.

Telugu 70mm

Recent Posts

తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు దర్శకుల ప్రయత్నం

‘ఆచార్య‘ ముందు వరకూ తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ. అయితే.. మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య‘ కొరటాల…

10 hours ago

Chiranjeevi’s wish to award NTR with Bharat Ratna

The Bharat Ratna Award is India's highest civilian award. Bharat Ratna is awarded to those…

12 hours ago

ఎన్టీఆర్ కి భారతరత్న రావాలని ఆకాంక్షించిన చిరంజీవి

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన…

12 hours ago

Ram is getting ready with a crazy lineup

Energetic star Ram, who came before the audience with last year's movie 'Skanda', is going…

15 hours ago

Another female director of Telugu film industry

Lady directors are now on the rise in the Telugu film industry. Veteran actresses like…

15 hours ago

The rush of movies on May 31 is not usual

On one side, the heat of the election, on the other, IPL. With this, there…

15 hours ago