బాలీవుడ్ ను కాపాడాల్సింది ఖాన్, కపూర్ లే

గతంలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకున్నది ప్రపంచం. ఆ పర్సెప్షన్ ను మార్చి ఇండియన్ సినిమా అంటే సౌత్ ఇండియానే అని కొత్తగా డిసైడ్ చేసింది సౌత్. ఆ రేంజ్ లో వస్తోన్న సినిమాలతో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుసగా సౌత్ మూవీస్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. దీంతో మన సినిమాలకు దీటుగా వారూ కొత్తగా ప్రయత్నాలు చేస్తోన్న అవేవీ వర్కవుట్ కావడం లేదు. టాప్ స్టార్స్ నుంచి మినీ స్టార్స్ వరకూ మాగ్జిమం ట్రై చేస్తోన్న బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావడం లేదు. గత రెండేళ్లలో అక్కడ సాలిడ్ హిట్ అంటే రీసెంట్ గా వచ్చిన చిన్న హీరో సినిమా భూల్ భులాయా మాత్రమే. అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో బాలీవుడ్ కు కొత్త భయం పట్టుకుంది. రాబోయే రోజుల్లో తమ సినిమాల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తోంది. ఈ టైమ్ లో వస్తోన్న రెండు సినిమాలపై వాళ్లు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆ రెండు సినిమాలే లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర.ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్. ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఆగస్ట్ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి ఆర్మీలో సేవలు అందిస్తే ఎలా ఉంటుంది.. అనే పాయింట్ తో వస్తోన్న ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ నటన హైలెట్ అవుతుందనేది ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నాగ చైతన్య సైతం ఓ కీలకమైన పాత్రలోనే కనిపించబోతున్నాడు. ట్రైలర్ మోస్ట్ ప్రామిసింగ్ గా ఉండటంతో బాలీవుడ్ ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది.

ఇక లేటెస్ట్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర ట్రైలర్ సైతం మెస్మరైజింగ్ గా ఉంది. హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తోంది. క్రేజీ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఊర్వశి రౌతేలా విలన్ పాత్రలో నటించింది. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలీవుడ్ కు బిగ్ బూస్ట్ ఇవ్వబోతోన్న సినిమాగా కనిపిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ గా వస్తోన్న ఈ మూవీకి మన రాజమౌళి సపోర్ట్ కూడా ఉండటంతో చాలా వరకూ నమ్మకం పెట్టుకోవచ్చు అంటున్నారు.మొత్తంగా కొన్నాళ్లుగా పూర్తిగా కుదేలైపోయిన బాలీవుడ్ మార్కెట్ ను మళ్లీ నిలబెట్టాలంటే ఆగస్ట్ లో వస్తోన్న ఆమిర్ ఖాన్, సెప్టెంబర్ లో వస్తోన్న రణ్ బీర్ కపూర్ ల వల్లే అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి ఆ నమ్మకాన్ని ఈ ఇద్దరు స్టార్స్ నిలబెడతారా లేదా అనేది చూడాలి.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

3 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

7 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

7 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

9 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

11 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

12 hours ago