HomeLatest‘సేవ్ ద టైగర్స్‘ కోసం ఓటీటీ సంస్థ బంపరాఫర్

‘సేవ్ ద టైగర్స్‘ కోసం ఓటీటీ సంస్థ బంపరాఫర్

-

ఈమధ్య కాలంలో సినిమాలకు దీటుగా సిరీస్ లకు కూడా మంచి పేరొస్తుంది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన కొన్ని సిరీస్ లకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విపరీతమైన ఫాలోయింది ఉంది. అలాంటి వాటిలో ముందు వరుసలో నిలిచే సిరీస్ ‘సేవ్ ద టైగర్స్‘. ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆరు ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ రిలీజైంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

సీజన్ 1 తర్వాత సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. లేటెస్ట్ గా ‘సేవ్ ద టైగర్‘ సీజన్ 2 రెడీ అవుతోంది. త్వరలోనే సీజన్ 2ని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతోంది టీమ్. సీజన్ 2 స్ట్రీమింగ్ మొదలయ్యే ముందు సీజన్ 1ని మరోసారి అందరూ ఆస్వాదించేందుకు ఉచితంగా తమ ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. మార్చి 10వ తేదీ వరకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ‘సేవ్ ద టైగర్స్‘ సీజన్ 1 ని ఉచితంగా వీక్షించొచ్చట.

ఇవీ చదవండి

English News