సామాజిక కార్యక్రమాల్లో ముందున్న ‘మాట‘

మన అమెరికా తెలుగు అసోసియేషన్‌ (మాట) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్‌ ఆపరేషన్ల క్యాంప్‌ ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ‘మాట‘ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని తమ అసోషియేషన్ గురించి పలు విశేషాలు వెల్లడించారు. మన అమెరికా తెలుగు అసోసియేషన్‌.. 22 బ్రాంచిలను దాదాపు 5000 మందితో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.

ఇదే కార్యక్రమంలో ఫెస్టివల్స్‌ ఫర్‌ జోయ్‌ అధ్యక్షురాలు సుమ కనకాల మాట్లాడుతూ.. ‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయగలిగారని దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్‌ నేత్రాలయ టీమ్‌ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా‘ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ కనకాల.. ‘గతంలో తనను ఎవరన్నా సుమ భర్త అని అంటుంటే చిరాగ్గా ఉండేదని.. ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్‌ ఎగరేసుకుని మరీ సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది అనే‘ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related Posts