‘హాయ్ నాన్న‘ నుంచి ‘ఓడియమ్మ‘ పార్టీ సాంగ్

నేచురల్ స్టార్ నాని సినిమాల్లో అతని సహజ నటనతో పాటు మరో స్పెషల్ అట్రాక్షన్ సాంగ్స్. ఇక.. నాని లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న‘ నుంచి ఇప్పటికే రిలీజైన ‘సమయమా, గాజు బొమ్మా, అమ్మాడి‘ గీతాలకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓడియమ్మా‘ అంటూ సాగే మంచి మాస్ బీట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాని, శ్రుతి హాసన్ కాంబినేషన్ లో బీచ్ సైడ్ బటర్ ఫ్లై డిజైన్ లో వేసిన అద్భుతమైన సెట్ లో ఈ పాటను చిత్రీకరించారు.

‘ఓడియమ్మ హీటు.. ఈడియమ్ లో బీటు.. రేడియమ్ లా లైటు.. పార్టీలో ఇటు అటు‘ అంటూ సాగే ఈ గీతాన్ని శ్రుతి హాసన్ తో కలిసి విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ అద్భుతంగా ఆలపించాడు. ఈ పాటలో చిన్మయి శ్రీపాద కూడా గొంతు కలిపింది. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతంలో అనంత్ శ్రీరామ్ ఈ గీతాన్ని రాశాడు. బాస్కో కొరియోగ్రఫీ ఈ సాంగ్ కి మరో అదనపు ఆకర్షణ. మొత్తంమీద.. మంచి మాస్ బీట్ తో.. స్టైలిష్ స్టెప్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది ఈ గీతం.

Related Posts