వీరమల్లు ఆగిపోయిందా..? బాబి డియోల్ ఎందుకలా అన్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొదలైన పాన్ ఇండియన్ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే, ఇప్పటి వరకూ పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల కేవలం బ్రేక్ మాత్రమే పడిందని అందరూ భావించారు. కానీ, బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ చెప్పిన మాటలు వింటే ‘హరిహర వీరమల్లు’ పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరో రన్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక