మహాశివరాత్రి కానుకగా మార్చి 8న గోపీచంద్ ‘భీమా’, విశ్వక్ సేన్ ‘గామి’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు డివోషనల్ టచ్ ఉంది. పరోక్షంగా శివుడి ప్రస్తావన ఈ సినిమాల్లో ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. అందుకే.. ఈ రెండు సినిమాలను మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నారు. ఇక.. ఈ సినిమాలతో పాటు.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న పలు కొత్త చిత్రాల నుంచి కొత్త కానుకలు సిద్ధమవుతున్నాయి.
శివుడి కథాంశంతో రూపొందుతోన్న ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్ రాబోతుంది. శివ భక్తుడు కన్నప్ప గా విష్ణు టైటిల్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో మహాశివుడిగా రెబెల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తాడనే ప్రచారం ఉంది. ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ శివుడి లుక్ కి సంబంధించి ఏదైనా రివీల్ చేసే అవకాశమూ ఉందట.
డివోషనల్ టచ్ తోనే రూపొందుతోన్న ప్రభాస్ ‘కల్కి’ నుంచి కూడా కొత్త గ్లింప్స్ కానీ.. పోస్టర్ కానీ రిలీజయ్యే అవకాశాలున్నాయి. మెగాస్టార్ సోషియో ఫాంటసీ ‘విశ్వంభర’ నుంచి కొత్త కానుక సిద్ధమవుతోందట. ఇంకా.. బాలకృష్ణ 109కి సంబంధించిన స్పెషల్ అప్డేట్ కూడా మహాశివరాత్రి కానుకగా వస్తోందట. ఆశిష్-వైష్ణవి జంటగా నటిస్తున్న ‘లవ్ మీ’ టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్సుంది.