ఇటలీలో ప్రభాస్, దిశా పఠాని ఆటా పాటా

రెబెల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఎ.డి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీలోని ఓ పాట చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లింది టీమ్. ఇటలీలో ఆటా పాటా అంటూ హీరో ప్రభాస్ తో పాటు.. హీరోయిన్ దిశా పఠాని, డైరెక్టర్ నాగ్ అశ్విన్ మిగతా క్రూతో కలిసున్న ఓ ఫోటోని షేర్ చేసింది టీమ్. సంతోష్ నారాయణన్ సంగీతంలో రూపొందిన ఓ పెప్పీ నంబర్ ను ప్రభాస్, దిశా పఠానీ లపై షూట్ చేస్తున్నారట.

వైజయంతీ సంస్థకు బాగా కలిసొచ్చిన మే 9వ తారీఖున ‘కల్కి’ విడుదలకు ముస్తాబవుతోంది. అయితే.. ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తోందా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆద్యంతం విజువల్ వండర్ లా రూపొందుతోన్న ‘కల్కి’ విజువల్ ఎఫెక్ట్స్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయట. ఆ అవుట్ పుట్ మంచి క్వాలిటీతో అనుకున్నట్టు వస్తే ఫర్వాలేదు. లేకపోతే.. విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ‘కల్కి’ని వాయిదా వేసే అవకాశాలున్నాయట.

Related Posts