తండేల్.. ఈ మధ్య కాలంలో మంచి బజ్ తెచ్చుకున్న మూవీ. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రాబోతున్న మూవీ తండేల్. జాలరి పాత్రలో నాగచైతన్య, అతన్ని ప్రేమించే అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గీతాఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
తండేల్ మూవీలో మెయిన్ లీడ్ పాల్గొనే కీలక లెంగ్తీ షెడ్యూల్‌ని కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్.
ఇప్పటికే విడుదలైన ‘తండేల్’ ప్రమోషనల్ కంటెంట్ సంచలనం సృష్టించింది. ఎసెన్స్ అఫ్ ‘తండేల్’ గ్లింప్స్ నేషనల్ వైడ్ గా ట్రెండై సినిమాపై అంచనాలని మ్యాసీవ్ గా పెంచింది. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ మెస్మరైజింగ్ చేయనుంది.
ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది అర్ధమౌతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి చాలా సహజ సిద్ధంగా కనిపించారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం సుందరమైన, సహజసిద్ధమైన లోకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు మేకర్స్.