మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రాజా ది రాజా సినిమా గ్రాండ్‌ ఓపెనింగ్

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రాజా ది రాజా సినిమా గ్రాండ్‌గా ఓపెనింగ్ జరుపుకుంది. కెమెరా స్విచ్ఛాన్ రవిబాబు చేశారు. గౌరవ దర్శకత్వం కృష్ణారెడ్డి గారు చేశారు. మంత్రి కోమటిరెడ్డి గారు క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాలో రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్‌ జంటగా నటిస్తున్నారు. మణికాంత్ గెల్లి డైరెక్షన్‌ చేస్తున్న ఈ సినిమాని చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి లు నిర్మిస్తున్నారు.


తెలంగాణా సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చిన ఫస్ట్ సినిమా మాదే కావడం గర్వంగా ఉందన్నారు చిత్రనిర్మాత చాణ్యక్య అద్దంకి. ఫ్రెండ్లీ టీమ్‌ తో రెండు నెలల్లో ఈ చిత్ర షూటింగ్ ను కంప్లీట్ చేసి రిలీజ్‌ చేయబోతున్నామన్నారు.


తెల్లవారితే గురువారం తరవాత డైరెక్ట్ చేస్తున్న మూవీ రాజా ది రాజా అన్నారు చిత్ర దర్శకుడు మణికాంత్ గెల్లి. నేచర్ తో రిలేట్ అయిన ఉన్న ఒక పాయింట్ కథలో ఉంటుంది. పూర్తి కమర్షియల్ మూవీ కాకపోయినా..కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా రూపొందిస్తున్నామన్నారు.
ఓ మంచి సినిమాతో మీముందుకు రాబోతున్నాం.. నా పాత్ర చాల ఎగ్జైటింగ్ గా అనిపించిందన్నారు హీరో రుత్విక్‌ కొండకింది.


హీరోయిన్ కావాలనేది నా డ్రీమ్‌.. ఆ కల రాజా ది రాజా తో తీరింది. ఈ అవకాశాన్నిచ్చిన చిత్ర దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు హీరోయిన్‌ విశాఖ దిమాన్‌.

Related Posts