ఆలోచింపజేస్తున్న ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్‌

తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హీట్ పెరిగిపోతుంది. ఆ హీట్‌కు తగ్గట్టుగా సినిమా కాన్సెప్ట్‌లు రూపొందుతున్నాయి. ఆయా పార్టీలు సినిమాల ద్వారా ప్రమోట్‌ చేసుకుంటూ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులు, ఎదుర్కొంటున్న రాజధాని సంక్షోభం నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమా రెడీ అయ్యింది.


వినోద్ కుమార్,వాణీ విశ్వనాధ్ ప్రధాన పాత్రలతో అమరావతి రైతుల రాజధాని కలలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అమరావతి పరిస్థితి, జరిగిన జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టేలా రాజధాని ఫైల్స్ సినిమాను రూపొందించారు.


వాస్తవ సంఘటనలని కథగా తీసుకొని, చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు దర్శకుడు భాను. మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేపధ్య సంగీతం ట్రైలర్ లో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. వాస్తవాన్ని అద్దంపట్టే కథ, ఆలోచింపజేసే డైలాగులు, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే నేపధ్య సంగీతంతో ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.

Related Posts