నైజాంలో పాతుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన రెండు మూడేళ్లలోనే అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించింది మైత్రీ మూవీ మేకర్స్. వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ నిర్మాణ రంగంలో తమకు తిరుగులేనిపించారు. ‘పుష్ప’తో పాన్ ఇండియా లెవెల్ లోనూ సత్తా చాటారు. ఇక.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించడమే కాకుండా.. వాటిని నైజాంలో సొంతంగా విడుదల చేసి ఘన విజయాలు సాధించారు.

ఇప్పుడు ఇదే ఊపులో ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ ‘సలార్’ని నైజాం లో విడుదల చేస్తున్నారు. ‘సలార్’ నైజాం హక్కులను ఏకంగా రూ.90 కోట్లకు దక్కించుకున్నారట. వీటిలో రూ.65 కోట్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ అయితే.. రూ.25 కోట్లు రిఫండబుల్. ‘సలార్’తో పాటు లేటెస్ట్ గా ‘హనుమాన్’ మూవీ నైజాం రైట్స్ ను కూడా మైత్రీ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో నైజాం అనగానే ముందుగా దిల్ రాజు, ఏషియన్ సంస్థలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడు నైజాం అనగానే మైత్రీ కూడా ముందు వరుసలో నిలుస్తోంది.

Related Posts