మెగా 156.. ‘విశ్వంభర‘కి విలన్ దొరకేశాడు

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం తాజాగా హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. మొదటి షెడ్యూల్ ని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పూర్తిచేశారు. ఫస్ట్ షెడ్యూల్ లో చిరంజీవి లేకుండానే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు మొదలైన రెండో షెడ్యూల్ లోనూ చిరు పాల్గొనడట. జనవరి చివర నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మెగా ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు.. ఈ మూవీలో విలన్ గా టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా నటిస్తాడనే ప్రచారం జరిగింది. రానా కూడా ఈ మెగా ప్రాజెక్టులో నటించడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించాడట. అయితే.. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి రానా తప్పుకున్నాడట.

తేజతో చేయబోయే ‘రాక్షస రాజా‘ సినిమాతో ఈ మూవీకి డేట్స్ క్లాష్ అవుతుండడం వలనే మెగా ప్రాజెక్ట్ నుంచి రానా తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. రానా స్థానంలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ని విలన్ గా ఎంపిక చేశారట. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్న కునాల్.. హీరోగా, విలన్ గా ఎన్నో సినిమాలు చేశాడు. తెలుగులోనూ నాగార్జున, నాని మల్టీస్టారర్ ‘దేవదాస్‘లో నెగటివ్ రోల్ లో నటించాడు. లేటెస్ట్ గా మెగా 156లో విలన్ గా ఎంపికవ్వడమే కాకుండా.. నేటి నుంచే కునాల్ కపూర్ షూటింగ్ లో జాయిన్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర‘ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Related Posts