కోలీవుడ్ లో తీవ్ర విషాదం.. హీరో విజయ్ కాంత్ మృతి

ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ (71) కన్నుమూశారు. విజయ్ కాంత్ 1952 ఆగస్టు 25 న మదురై లో జన్మించారు. విజయ్ కాంత్ ఎందులో కాలు పెట్టినా విజయమే. పేరుకు తగ్గట్లుగానే అటు సినిమాల్లో, ఇటు రాయకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
విజయకాంత్ అసలు పేరు నారాయణన్ ‘విజయరాజ్‘ అళగస్వామి. సినిమాల్లోకి వచ్చాక విజయకాంత్ గా పేరు మార్చుకుని స్టార్ హీరోగా ఎదిగారు. విజయ్ కాంత్ సక్సెస్ ఫుల్ స్టార్ హీరో మాత్రమే కాదు నిర్మాత, దర్శకుడు. 1979లో ‘ఇనిక్కుమ్ ఇళమై‘ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంలో విలన్ గా నటించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘సత్తం ఒరు ఇరుత్తరాయ్‘ తో తొలి సక్సెస్ ను సాధించారు. విజయ్ కాంత్ తన 100వ చిత్రం నుంచి ఆయనను “కెప్టెన్”గా పిలవడం మొదలు పెట్టారు. ఒకానొక సమయంలో ఒకే ఏడాది 18 సినిమాలను విడుదల చేసి తన పేరు మీద ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ లిఖించుకున్నారు. ఈ రికార్డును తమిళనాట ఇంతవరకూ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోయారు.

80వ దశకంలో విజయకాంత్ తన యాక్షన్ స్టార్ ఇమేజ్ తో సౌత్ లోనే పాపులర్ అయ్యాడు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగు, హిందీలోకి డబ్ చేశారు. విజయకాంత్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘పురట్చి కలైంజర్‘ అనే బిరుదు ఉంది. అంటే విప్లవ కళాకారుడు అని అర్థం. ఆయన చిత్రాలలో దేశభక్తి, డ్యూయల్ రోల్ యాక్టింగ్‌గా తరచూ కన్పించేవి. అతను పోలీసు అధికారిగా 20కి పైగా చిత్రాలలో నటించారు. విజయ్ కాంత్ చివరి సినిమా మధుర వీరన్ (2018).

దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 2005 తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
2005 సెప్టెంబర్ 14 న DMDK పార్టీనీ స్థాపించిన విజయ్ కాంత్ 2005లోనే తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 2011 నుండి 2016 సంవత్సరాలలో ఆయన ప్రతిపక్ష నేతగా తమిళనాడు శాసనసభలో ఉన్నారు. విజయ్ కాంత్ ప్రేమలతను వివాహం చేసుకున్నారు. విజయ్ కాంత్ కు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు .విజయ్ కాంత్ మృతికి ప్రముఖుల సంతాపం తెలియజేశారు. నేడు తమిళనాడు లోని థియేటర్స్ లో షో లు రద్దు చేశారు.

Related Posts