సంక్రాంతి బరిలో రవితేజ డబుల్ ధమాకా

మాస్ మహారాజ రవితేజ సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి ఈజీగా రెండు మూడు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తుంటాడు మాస్ రాజా. ఇక.. రాబోయే సంక్రాంతి బరిలో ‘ఈగల్‘ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించడానికి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ‘ఈగల్‘పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీలో డిఫరెంట్ మేకోవర్ తో మాస్ మహారాజ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించబోతున్నాడనే విషయం అర్థమైంది.

సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఈగల్‘తో వస్తోన్న రవితేజ.. జనవరి 12న ‘హనుమాన్‘ సినిమాతోనూ ఆడియన్స్ కు వినిపించబోతున్నాడు. అంటే.. ‘హనుమాన్‘ మూవీలోని కోటి అనే ఓ కోతి పాత్రకు వాయిస్ ఓవర్ అందించాడట రవితేజ. ఈ విషయాన్ని ‘హనుమాన్‘ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. గతంలో ‘మర్యాదరామన్న‘ సినిమాలో ఓ సైకిల్ కి రవితేజ ఇచ్చిన వాయిస్ ఎలాంటి ఇంప్రెషన్ సృష్టించిందో చూశాము. ఇప్పుడు మళ్లీ ‘హనుమాన్‘తో అలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు. మొత్తంమీద.. సంక్రాంతి బరిలో ఇటు ‘హనుమాన్‘ చిత్రంలోని వాయిస్ ఓవర్ తో.. అటు ‘ఈగల్‘ మూవీతో హీరోగానూ.. ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అందించబోతున్నాడన్నమాట.

Related Posts