వెండితెరపైకి మధుబాల బయోపిక్

హిందీలో రూపొందే బయోపిక్ లకు మంచి పేరు ఉంది. వాస్తవాలకు దగ్గరగా ఉన్నా లేకున్నా.. ఆ ఎమోషన్స్ ను క్యారీ చేయడంలో బాలీవుడ్ మేకర్స్ బెస్ట్ అనిపించుకున్నారు. తెలుగులో ఆ మధ్య వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి మంచి విజయం సాధించింది. సావిత్రిలాగానే విషాద జీవితం గడిపిన అలనాటి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మధుబాల కథ కూడా త్వరలోనే తెరపైకి రానుంది. అంటే మరో గ్రేట్ యాక్ట్రెస్ బయోపిక్ వస్తోందన్నమాట.మార్లిన్ మన్రో ఆఫ్‌ బాలీవుడ్ అని కీర్తి గడించిన నటి మధుబాల. బాల నటిగా వెండితెరపై అడుగుపెట్టి 14యేళ్ల వయసులోనే హీరోయిన్ గా మారింది. తొలి సినిమా నీల్ కమల్. రాజ్ కపూర్ సరసన. ఆ కాలంల అందంలో మధుబాలకు సాటి లేదు అన్న పేరు ఉంది. అలాంటి బ్యూటీని అప్పటి వరకూ ఎవరూ చూడలేదు అని చెప్పుకునేవారు. గ్లామర్ తో పాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో తనదైన ముద్రను బలంగా వేసిన నటి మధుబాల. మధుబాలకు ఎక్కువ పేరు తెచ్చిన సినిమాలుగా మహల్, దులారి, మిస్టర్ అండ్ మిసెస్, చల్తీ కా నామ్ గాడి, మొఘల్ ఏ ఆజమ్, బర్సాత్ కి రాత్ వంటి సినిమాలు ప్రధా

నంగా కనిపిస్తాయి. మొఘల్ ఏ ఆజమ్ లోని ప్యార్ కియాతో డర్నా క్యా అనే పాట ఆమెలోని గొప్ప నటిని చూపిస్తుంది.మధుబాలకు చాలా చిన్న వయసులోనే గుండె సంబంధిత జబ్బు సోకింది. అప్పట్లో హార్ట్ కు సంబంధించిన ఆధునిక వైద్యం లేకపోవడంతో కేవలం 36యేళ్ల వయసులోనే కన్నుమూసింది. అంతకు ముందే దిలీప్ కుమార్ తో ప్రేమ వ్యవహారం, చివరికి కిశోర్ కుమార్ ను పెళ్లి చేసుకోవడంతో పాటు ఇంకా ఇతర ప్రేమకథలు వంటి అంశాల్లోనూ నిత్యం వార్తల్లో నిలిచేవారు మధుబాల. ఇవన్నీ ఎలా ఉన్నా.. కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉన్న జీవితం మధుబాలది. అలాంటి తన బయోపిక్ అంటే ఆ కాలం ప్రేక్షకులకు ఓ గొప్ప వార్తే అవుతుంది. ఈ చిత్రానికి ఆమె సిస్టర్స్ అంతా నిర్మాతలుగా వ్యవహిరించబోతున్నారు. అయితే ఇందులో మధుబాలగా నటించేది ఎవరు.. దర్శకుడు ఎవరు అనే అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా అలనాటి మేటి నటిగా మధుబాల బయోపిక్ ఈ కాలంలోనూ ఆకట్టుకునే కథే అవుతుందని చెప్పొచ్చు.

Related Posts