కర్నూలు లో బాలకృష్ణ హల్చల్

నందమూరి బాలకృష్ణ కర్నూలు పట్టణంలో హల్చల్ చేస్తున్నారు. తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. “ఎన్బీకే 107” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీని చాలా వేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారీ చిత్రంలో. రీసెంట్ గా ఓ భారీ సెట్ లో షూటింగ్ జరిపింది టీమ్. ఇప్పుడు మరో షెడ్యూల్ కోసం కర్నూలు వెళ్లారట. కర్నూలులో వెయ్యిమందికి పై గా జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ సీన్ ను షూట్ చేస్తున్నారు. మరి సీమ సింహం సీమలోకి ఎంటర్ అయితే అభిమానులు ఊరుకుంటారా..? కోరు కదా..? షూటింగ్ తో పాటు బాలయ్యను చూసేందుకు చాలా పెద్ద ఎత్తున జనం ఆ స్పాట్ కు వస్తున్నారు.

మామూలుగా బాలయ్య అంటే ఎవరైనా దగ్గరకు వస్తే కొడతారు. ర్యాష్‌ గా బిహేవ్ చేస్తారు అనే ఇమేజ్ ఉంది. కానీ అన్ స్టాపబుల్ షోతో ఆయన ఎంత లవబుల్ అనేది చూపించాడు. అది పబ్లిక్ గానూ మరోసారి చూపిస్తున్నారట. ఓ వైపు షూటింగ్ లో నటిస్తూనే మరోవైపు తన కోసం వస్తోన్న వందలాది మంది అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వారితో ఫోటోస్ దిగుతున్నారు. ఒక స్టార్ హీరో ఒక రోజు ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టి యాభై వందా ఫోటోస్ ఇవ్వాలంటేనే ఇబ్బంది పడతాడు. అలాంటి బాలయ్య ఏకంగా స్పాట్ లోనే రోజూ వస్తోన్న వందలాది మందికి ఫోటో ఇస్తూ వారితో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారట. బాలయ్య ఈ బిహేవియర్ చూసిన జనం .. అరే ఇన్నాళ్లూ బాలయ్యను అనవసరంగా అపార్థం చేసుకున్నామే అని బాధపడుతున్నారు. మొత్తంగా బాలయ్య కర్నూలు లో మంచి హల్చల్ చేస్తున్నాడన్నమాట.

Related Posts