ఆదిపురుష్ నుంచి సీతగా కృతి సనన్ ఫస్ట్ లుక్ పోస్టర్

భారతీయ ఇతిహాసాల్లో సీత పాత్రకు ఉండే గౌరవం మరే పాత్రకూ ఉండదంటే అతిశయోక్తి కాదు. నేటికీ పాతివ్రత్యానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే సీతనే చెబుతారు. మహా సాథ్విగా రామాయణంలో అద్భుతమైన పాత్రగా గుర్తింపు పొందింది సీత. అందుకే ఎవరైనా రామాయణ నేపథ్యంలో సినిమాలు చేస్తే సీత పాత్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

తెలుగులో ఒకప్పుడు అంజలీ దేవి ఆ పాత్రకు అద్బుతమైన గౌరవాన్ని తెచ్చింది. ఈ తరంలో నయనతార మెప్పించగలిగింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి వస్తోన్న ఆదిపురుష్ కోసం సీత పాత్రలో కృతి సనన్ ను తీసుకున్నారు. మన డార్లింగ్ ప్రభాస్ రాముడుగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కృతి సనన్ పాత్రకు సంబంధించిన జానకి లుక్ ను సీతా నవమి సందర్భంగా విడుదల చేశారు. పోస్టర్ లోనే ఆ రూపం ముగ్ధమనోహరంగా ఉంది. జానకి పాత్రలో కృతి సనన్ స్వచ్ఛత, దైవత్వం నిండి ఉండి.. ధైర్యానికి ప్రతీక అయిన రాముడు భార్యగా కనిపిస్తోంది.

ఇక ఈ లుక్ తో పాటు ఓ సాంగ్ టీజర్ ను కూడా విడుదల చేశారు. రామ్ సియారామ్ అంటూ సాగే ఈ గీతం ప్రేక్షకులను ఆధ్యాత్మికత, భక్తి ప్రపంచానికి తీసుకువెళ్లేలా ఉంది. ఈ గీతాన్ని సచేత్-పరంపర స్వరపరిచారు.


మొత్తంగా లాస్ట్ ఇయర్ టీజర్ పై వచ్చిన విమర్శలను ఒక్కొక్కటిగా తుడిచేస్తూ ఒక్కో లుక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆదిపురుష్ టీమ్ మరి వీరి ప్రయత్నం సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది ఈ జూన్ 16న తెలుస్తుంది.


అయితే ఇప్పటి వరకూ మన తెలుగువాళ్లు తప్ప భారత పురణాలను అద్భుతంగా ఎవరూ తెరకెక్కించలేదు. ఈ చిత్ర టీజర్ చూసినప్పుడు తేడాగానే అనిపించింది. కాకపోతే ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా చేసిన సినిమా కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts