రాధేశ్యామ్ నుంచి కీలకమైన అప్డేట్ ..?

ప్యాన్ ఇండియన్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ నుంచి కీలకమైన అప్డేట్ వస్తోంది. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన రాధేశ్యామ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నా అని గతంలో ప్రకటించారు. దీంతో చాలాకాలంగా ఈమూవీ కోసం వెయిట్ చేస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ కేస్ లు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ లో 50శాతం మాత్రమే ఆక్యుపెన్సీ అనే నిబంధన పెట్టేశాయి. అటు ఇతర దేశాల్లో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ కారణంగానే రీసెంట్ గా ఈ నెల 7న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ లానే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొదిన రాధేశ్యామ్ కూడా పోస్ట్ పోన్ అయినట్టే అని వార్తలు వచ్చాయి. ఇదే అదనుగా చాలా చిన్న సినిమాలు సంక్రాంతి రిలీజ్ అంటూ కొత్త పోస్టర్స్ వేసుకున్నాయి. బట్ రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయినట్టుగా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు కదా..?
యస్.. అంతా ఊహిస్తున్నట్టుగా రాధేశ్యామ్ పోస్ట్ పోన్ కావడం లేదు. చెప్పిన టైమ్ కు సంక్రాంతి బరిలో ప్రభాస్ నిలుస్తున్నాడు. ఈ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోనే రిలీజ్ కాబోతోందీ చిత్రం అంటూ సినిమాకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు చెబుతున్న సమాచారం. అంటే ఇప్పుడు రాధేశ్యామ్ రావడం లేదని కర్చీఫ్ వేసిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటీ అనుకుంటున్నారు కదూ..? వెరీ సింపుల్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఉంది కాబట్టి.. అన్ని థియేటర్స్ ప్రభాస్ కే ఇవ్వలేరు కాబట్టి.. కొన్ని బంగార్రాజుకు వెళ్లినా మిగిలినవి మిగతా వాళ్లు పంచుకుంటారు.
ఏదేమైనా రాధేశ్యామ్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయరని తెలుస్తోంది. మరి వీరి ధైర్యం ఏంటనేది తెలియదు కానీ.. నిజంగా వస్తే సంక్రాంతి సంబురాలు డబుల్ అవుతాయని చెప్పొచ్చు.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

3 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

8 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

8 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

10 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

11 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

13 hours ago