ధనుష్ – వెంకీ అట్లూరి ‘సార్’ చిత్రం ప్రారంభం

జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ధనుష్ హీరోగా తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం సార్ (తెలుగు) ‌వాతి,(తమిళం) నేడు 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల‌ రంగ్‌దే చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్ర నాయకా, నాయికలు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. ప్రముఖ నిర్మాతలు డా: కె.ఎల్.నారాయణ, ఎం.ఎల్. కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందచేశారు.

జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్ స్లోగన్ తో ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం కలిగించింది.


తెలుగు, తమిళ భాషల్లో చిత్రం పేరుతో కూడిన విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి. జ‌న‌వ‌రి 5 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు.

Telugu 70mm

Share
Published by
Telugu 70mm

Recent Posts

Our stars creating sensation in Japan

It should be said that Rajinikanth is a well-known Indian actor in Japan. Rajinikanth's film…

1 min ago

‘R.R.R’ will once again rock the North

Summer is the biggest season for movies. However.. this summer is going very dull. On…

8 mins ago

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

16 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

18 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

18 hours ago