రాధేశ్యామ్ నుంచి కీలకమైన అప్డేట్ ..?

ప్యాన్ ఇండియన్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ నుంచి కీలకమైన అప్డేట్ వస్తోంది. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన రాధేశ్యామ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నా అని గతంలో ప్రకటించారు. దీంతో చాలాకాలంగా ఈమూవీ కోసం వెయిట్ చేస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ కేస్ లు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ లో 50శాతం మాత్రమే ఆక్యుపెన్సీ అనే నిబంధన పెట్టేశాయి. అటు ఇతర దేశాల్లో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ కారణంగానే రీసెంట్ గా ఈ నెల 7న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ లానే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొదిన రాధేశ్యామ్ కూడా పోస్ట్ పోన్ అయినట్టే అని వార్తలు వచ్చాయి. ఇదే అదనుగా చాలా చిన్న సినిమాలు సంక్రాంతి రిలీజ్ అంటూ కొత్త పోస్టర్స్ వేసుకున్నాయి. బట్ రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయినట్టుగా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు కదా..?
యస్.. అంతా ఊహిస్తున్నట్టుగా రాధేశ్యామ్ పోస్ట్ పోన్ కావడం లేదు. చెప్పిన టైమ్ కు సంక్రాంతి బరిలో ప్రభాస్ నిలుస్తున్నాడు. ఈ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోనే రిలీజ్ కాబోతోందీ చిత్రం అంటూ సినిమాకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు చెబుతున్న సమాచారం. అంటే ఇప్పుడు రాధేశ్యామ్ రావడం లేదని కర్చీఫ్ వేసిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటీ అనుకుంటున్నారు కదూ..? వెరీ సింపుల్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఉంది కాబ�