కళ్యాణ్ రామ్ కెరీర్ కు 20 ఏళ్లు

బాల నటుడిగానే బాలయ్య ‘బాల గోపాలుడు‘ సినిమాలో కనిపించాడు కళ్యాణ్ రామ్. ఇక హీరోగా కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘తొలిచూపులోనే‘. ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ లో ఈ చిత్రం రూపొందింది. రామోజీరావు నిర్మాతగా వ్యవహరించిన 75వ సినిమా ఇది. ‘తొలిచూపులోనే‘ సినిమా 2003, అక్టోబర్ 9న విడుదలైంది.

కళ్యాణ్ రామ్ కి జోడీగా ఆకాంక్ష నటించిన ఈ సినిమాలో శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అప్పటికే ‘నువ్వు లేక నేను లేను‘ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వై.కాశీవిశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి రచన చేశారు. చక్రి సంగీతాన్ని సమకూర్చాడు.

నటరత్న నందమూరి తారకరామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణ తనయుడిగా చిత్రం రంగంలోకి ప్రవేశించిన కళ్యాణ్ రామ్ కి తొలి సినిమా విజయాన్నందించలేకపోయింది. అయితే.. నటుడిగా పనికొస్తాడనే కామెంట్స్ మాత్రం వినిపించాయి. అలా ‘తొలిచూపులోనే‘ సినిమాతో చిత్ర పరిశ్రమలో తొలి అడుగులు వేసి.. ఆ తర్వాత ‘అతనొక్కడే‘ చిత్రంతో నట, నిర్మాతగా భారీ విజయాన్నందుకుని.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్.

Related Posts