‘అన్ స్టాపబుల్-3‘ ఫస్ట్ ఎపిసోడ్ రెడీ

నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ షో ‘అన్ స్టాపబుల్‘ మరోసారి రెడీ అవుతోంది. దసరా నుంచి ‘అన్ స్టాపబుల్‘ సీజన్-3 కి సన్నాహాలు చేస్తుంది ఆహా ఓటీటీ. అయితే సీజన్-3లో ఫస్ట్ ఎపిసోడ్ కోసం చిరంజీవి, రామ్ చరణ్, కె.టి.ఆర్ వంటి సెలబ్రిటీస్ అటెండ్ అవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ.. లేటెస్ట్ గా ‘అన్ స్టాపబుల్‘ ఫస్ట్ ఎపిసోడ్ పై క్లారిటీ ఇచ్చేసింది ఆహా టీమ్.

‘ఈసారి సప్పుడు జర గట్టిగా ఉంటది.. మొదటి ఎపిసోడ్ లో వచ్చేది ఎవరనుకుంటుర్రు మరి, మన ‘భగవంత్ కేసరి’ టీమ్‘.. అంటూ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె‘ లిమిటెడ్ ఎడిషన్ కి సంబంధించిన ప్రోమోని వదిలింది ఆహా. అయితే.. ఇది ‘అన్ స్టాపబుల్ 3‘నా లేక కేవలం లిమిటెడ్ ఎడిషన్ మాత్రమేనా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా ‘భగవంత్ కేసరి‘ టీమ్ తో లేటెస్ట్ గా రిలీజైన ‘అన్ స్టాపబుల్‘ ప్రోమో మాత్రం అదరగొడుతోంది.

Related Posts