‘కల్కి’.. ఒకే ఫ్రేములో ముగ్గురు లెజెండ్స్

భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలను అనుకున్న సమయానికి పూర్తిచేయడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ విషయంలో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు సినీ పండిట్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీగా ‘కల్కి 2898 ఎడి’ని తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఒకేసారి మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉండే ప్రభాస్ తో.. ‘కల్కి’ షూట్ ను ఎప్పుడు ఫినిష్ చేశాడో తెలీదు.. మొత్తంగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఇటీవల ఒక వారం రోజుల పాటు జరిగిన షెడ్యూల్ తో ‘కల్కి 2898 ఎడి’ షూటింగ్ మొత్తం పూర్తయ్యిందట. అలాగే.. ఈ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ తో పాటు.. లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా షూట్ చేశారట. అది ‘కల్కి 2898 ఎడి’కి ఒన్ ఆఫ్ ది హైలైట్స్ గా నిలవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కి జోడీగా దీపిక పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని ఓ కీ రోల్ లో కనిపించబోతుంది.

ఇప్పటివరకూ అనౌన్స్ చేయకపోయినా.. ‘కల్కి’ చిత్రాన్ని రెండు, మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు నాగ్ అశ్విన్. అందుకే.. ఫస్ట్ పార్ట్ షూట్ ఇంత తొందరగా కంప్లీట్ అయ్యిందట. మే 9న వైజయంతీకి బాగా కలిసొచ్చిన తారీఖునే ‘కల్కి 2898 ఎడి’ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts